మెగాస్టార్ చిరంజీవి తన 63వ పుట్టినరోజు వేడుకలను బుధవారం(ఆగస్టు 22వ తేదీ) జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఓ చిరు అభిమాని తన హీరో గురించి రాసిన కవిత ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే...
బుక్‌మై షోలు మాకు తెలియవు..
థియేటర్ బయట పోలీసులు తరుముతుంటే గోడలు దూకడమే మాకు తెలుసు.
ఆన్‌లైన్‌లు, జూక్ బాక్స్‌లు మాకు తెలియదు..
ఆడియో షాపుల్లో తెల్లవారుజామున మొదటి బంచ్ ఆడియో క్యాసెట్స్‌లో ఫస్ట్ క్యాసెట్ కొన్న కిక్ మాకు తెలుసు.
ఎంపీ3 ప్లేయర్లు మాకు తెలియవు..
ఏదో ఒక షాపులో కూర్చొని ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కి రేపు థియేటర్‌లో స్టెప్స్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో అని ఊహించుకోవడం మాకు తెలుసు.
ఫ్లెక్సీలు హోర్డింగ్‌లు మాకు తెలియవు..
పెయింటర్ వేసిన కటౌట్‌ని పెడుతుంటే.. ఫేస్ (ముఖం) పెట్టే టైమ్‌లో అర్థరాత్రి కొన్ని వందల మంది వేసిన ఈలలే మాకు తెలుసు.
యూట్యూబ్‌లో సాంగ్స్, వ్యూస్ ఇవేమీ మాకు తెలియవు..
లాస్ట్ సాంగ్ వరకు చూసేసి చెడ్డీ/లుంగీ వెనుక ఉన్న దుమ్ము దులుపుకుని, గుంపులు గుంపులుగా వెళ్లిపోవడం మాకు తెలుసు.
ఐడియల్ బ్రెయిన్ రేటింగ్‌లు, గ్రేట్ ఆంధ్రా రివ్యూలు మాకు తెలియవు..
సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అంటూ అరుచుకుంటూ వెళ్లడంలో ఉన్న కిక్ మాకు తెలుసు.
ఇన్ని వేల ఆనందాలు ఇచ్చావ్.. నీ చిన్నచిన్న తప్పులు మాకెందుకు అన్నయ్యా...
జీరో నుండి మొదలుపెట్టి శిఖరం చేరుకున్న వాడివి. ఆ రూట్ గురించి వేరేవాడు నీకు చెప్పాల్సిన పనిలేదు.
గన్ కన్నా పవర్ ఉన్న తమ్ముడు నీకు ఉన్నాడు..
నీ పేరు శాశ్వతంగా నిలబెట్టే కొడుకు నీకు ఉన్నాడు...
నీ డాన్స్‌లకు వన్నెతగ్గకుండా చూసే మేనల్లుళ్లు ఉన్నారు....
అన్నింటింకి మించి నిన్ను గుండెల్లో పెట్టి ఆరాధించే కోట్ల మంది అభిమానులు ఉన్నారు..
తెలుగు సినిమాకు మకుటం లేని మహరాజువి నువ్వు అన్నయ్యా...
వియ్ ఆర్ ఆల్ విత్ యూ అన్నయ్యా..
విష్ యు మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్యా...