గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (16:34 IST)

'నువ్వంటే నేనని' సాంగ్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్

Nuvvante nenani
సానా నా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా  'పిట్టల దొరస‌ బ్యాచిలర్స్, సంపెంగి, ప్రేమ పల్లకి,  జై బజరంగభళి వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించాయి. 2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా తయారు చేసుకున్న సరి కొత్త ప్రేమకథ తో రూపుదిద్దుకున్న మరో మ్యూజికల్ చిత్రం 'నువ్వంటే నేనని'. ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ  మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి.  గత ఏడాది షూటింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా క్రైసిస్ కారణం గా విడుదల ఆగింది. ఈ ఏడాది కూడా రెండో దశ కూడా కరోనా కారణంగా యావత్ సినీ పరిశ్రమ గందర గోల పరిస్థితి నెలకొంది. పెద్ద సినిమాలే విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఇక యదా పరిస్థితి కి చేరుతున్న తరుణం లో  'నువ్వంటే నేనని' చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్  లిరికల్ సాంగ్ ను డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 5:49 లకు విడుదల చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ,  నేను విడుదల చేసిన 'నమ్మవే చెలి' పాటలో మంచి లిరికల్ వ్యాలూస్ వున్నాయి. వరికుప్పల యాదగిరి ఈ పాటను రాసి తానే సంగీతాన్ని అందించడం విశేషం. పాట అద్భుతంగా వుంది ఈ రోజే చూసాను సిద్ శ్రీరామ్ పాడిన టాప్ సాంగ్స్ లో ఈ పాట నిలబడుతుంది . ఈ చిత్రం లో నటించిన నటి నటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. " అన్నారు.
 
దర్శక నిర్మాత సానా యాది రెడ్డి మాట్లాడుతూ, 'మహా నటి' 'జార్జి రెడ్డి' 'యాత్ర' వంటి చిత్రాల స్ఫూర్తి తో నేను ఓ కథ రెడీ చేశాను. 2004  హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా రాసుకున్నసరి కొత్త ప్రేమకథను తెరకెక్కిచాను.  నా బ్యానర్ ద్వారా అప్పట్లో కమెడియన్ గా చేస్తున్న అలీ ని పెట్టి  'పిట్టల దొర' గా, సంపెంగి చిత్రంతో  హీరో హీరోయిన్ లు గా దీపక్, కాంచి కౌల్ ని, బ్యాచిలర్స్ సినిమాతో శివాజీ వంటి హీరోను పరిచయం చేయడం జరిగింది. ఇప్పడు మళ్ళీ నూతన హీరో హీరోయిన్లతోనే  'నువ్వంటే నేనని' అనే చిత్రాన్ని నిర్మించాను. అదే విధంగా నా చిత్రాల ద్వారా  వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకి అతని పాటలు  ఓ  హైలెట్ గా నిలుస్తాయి. గత ఏడాది షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, ఈ ఏడాది జనవరి లో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చేసాం. గత రెండు ఏళ్లుగా మనల్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్  కారణంగా యావత్ భారతావని అన్ని రంగాలలో వెనక్కు వెళ్ళింది. ఇప్పుడైనా పరిస్థితి యదావిధిగా వుంటుందనే ఆశతో మా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి అన్నారు.  
 
మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయిత వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ - " నేను తొలిసారి మ్యూజిక్ డైరెక్షన్ లో చేసిన నా పాటను  పవర్ ఫుల్ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా రిలీజ్ కావడం ఆనందంగా వుంది. నన్ను పాటల రచయితగా పరిచయం చేసిన సాన యాది  రెడ్డి గారు, సంగీత దర్శకుడిగా కూడా అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.