పవన్‌ను లెక్చరర్‌గా చూపించనున్న హరీష్ శంకర్
టాలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "గబ్బర్ సింగ్" చిత్రంలో హరీష్ శంకర్ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నటించే 28వ చిత్రానికి హరీష్ శంకర్ మరోమారు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని పవర్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు.
కాగా త్వరలో సెట్స్ మీదకి రాబోతున్న తాజా చిత్రంలో పవర్ స్టార్ లెక్చరర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు లెక్చరర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించలేదన్న సంగతి తెలిసిందే. అద్భుతమైన క్యారెక్టర్ రాశాడని.. పవన్‌ని కొత్తగా చూపించేందుకు హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని సమాచారం.
ఇదిలావుంటే, ఏప్రిల్ 9న పవన్ నటించిన "వకీల్ సాబ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బోనీకపూర్ సమర్పిస్తుండగా దిల్ రాజు నిర్మించారు.