శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (21:05 IST)

సాక్షాత్తు శ్రీనివాసుడే సప్తగిరి అని పిలిచాడు - హీరో సప్తగిరి

"నాయనా సప్తగిరి జరుగు. సాక్షాత్తు తిరుమలలో ఒక కాషాయ వస్త్రం ధరించిన వ్యక్తి నన్ను అలా పిలిచాడు. నేను తెలుగు సినీ పరిశ్రమకు రావాలనుకున్నా. సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్శించుకుని నాలుగు మాడవీధుల్లో అలాఇల

"నాయనా సప్తగిరి జరుగు. సాక్షాత్తు తిరుమలలో ఒక కాషాయ వస్త్రం ధరించిన వ్యక్తి నన్ను అలా పిలిచాడు. నేను తెలుగు సినీ పరిశ్రమకు రావాలనుకున్నా. సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్శించుకుని నాలుగు మాడవీధుల్లో అలాఇలా తిరుగుతూ ఉన్నా. ఒక్కసారిగా పక్క నుంచి ఒక వ్యక్తి కాషాయ దుస్తులు ధరించి... నాయనా సప్తగిరి జరుగు అన్నాడు. తిరిగి చూస్తే ఆయన దేవుడిలాగా కనిపించాడు. ఆయన నవ్వుతూ వెళ్ళిన కొద్దిసేపటికి మరో 20 మంది సాధువులు నన్ను చూస్తూ నవ్వుతూ వెళ్ళారు.
 
అక్కడి నుంచి ఎంతో సంతోషంగా హైదరాబాద్‌కు వెళ్ళా. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన 15 రోజులకే సినిమాల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. వెంటనే నా పేరు మార్చుకున్నా. నా అసలు పేరు వెంకటప్రభు ప్రసాద్. ఆ పేరును సప్తగిరి అని మార్చేసుకున్నా. ఇక నా దశ తిరిగింది. సాక్షాత్తు శ్రీనివాసుడి పేరది. ఆయన కృపాకటాక్షాలతో నేను ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతున్నాను. స్వామి.. నువ్వే మా కులదైవం'' అంటూ సప్తగిరి ఒక సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడారు.