సంబంధిత వార్తలు
- రాజకీయ నాయకులపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
- ఏపీకి తదుపరి సీఎం ఎవరు? రఘుబాబు, విశాల్ స్పందన ఇదే
- భారతీయుడు 2 తో మరోసారి సేనాపతిగా కమల్ హాసన్ జూన్ కు సిద్ధం అవుతున్నాడు
- విశాల్ ‘రత్నం నుంచి మనసుని హత్తుకునే పాట చెబుతావా విడుదల
- నా జీవితాన్ని చూసి రత్నం లో డోంట్ వర్రీ రా చిచ్చా.. రాశాడనిపిస్తుంది : విశాల్
నా శరీరంలో వంద కుట్లున్నాయి, రత్నం కచ్చితంగా పైసా వసూల్ : హీరో విశాల్
Vishal latest
Ratnam pressmeet
హరి గారితో భరణి, పూజ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. విశాల్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. సతీష్ గారు ఈ సినిమాను తీసుకున్నందుకు థాంక్స్. అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలి. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తాను. అది నా బాధ్యత. మీడియా వల్ల ఈ చిత్రం ఇంత వరకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి. కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ.. విశాల్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే రత్నం చిత్రాన్ని తీసుకున్నాను. హరి గారి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్ అని అన్నారు.
తర్వాతి కథనం
