మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (13:29 IST)

హైపర్ ఆదికి, సుడిగాలి సుధీర్‌కి మధ్య గొడవ...

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పరిచయమైనవారిలో హైపర్ ఆది పంచులతో ఫేమస్ అయితే, సుధీర్ వివిధ టాలెంట్లతో పాటు యాంకర్ రష్మీ వల్ల పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్‌లతో బిజీ బిజీగా గడపుతున్నారు. తాజాగా హైపర్ ఆది సుధీర్‌తో గొడవ పెట్టుకున్నాడు. దానికి కారణమేంటో తెలుసుకుందాం..
 
ప్రతి పండుగకు, అకేషన్‌కు ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రాం చేయడం మల్లెమాల వాళ్లకు అలవాటుగా మారింది. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ రోజున ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చి అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలను కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రోమోలను బట్టి ఇందులో సుధీర్, ఆది, రోజా, జానీ మాస్టర్‌లతో పాటుగా చాలా మంది యాంకర్లు, ఆర్టిస్టులు ఉన్నారు.
 
ఒక ప్రోమోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మధ్య గొడవ జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. డ్యాన్స్ రాని ఆది, మంచి డ్యాన్సర్ అయ్యిన సుధీర్ పరస్పరం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.