శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (11:49 IST)

నాగశౌర్య కొత్త లుక్‌ అదుర్స్.. సిక్స్ ప్యాక్.. ఆర్చర్‌గా కనిపిస్తాడా?

#NS20
టాలీవుడ్ నాగశౌర్య కొత్త లుక్‌లో వచ్చేశాడు. నాగశౌర్య ఇటీవల చిత్రం 'అశ్వత్థామ' మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత కరోనా లాక్ డౌన్ పడటంతో తన తర్వాతి సినిమా ఏంటి అనేది చెప్పలేదు. కానీ రెండు రోజుల క్రితం తాను ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో వస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా నాగశౌర్య ప్రకటించాడు.
 
అలాగే సోమవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. అందులో సిక్స్ ప్యాక్‌తో చొక్కా విప్పి విల్లు ఎక్కుపెట్టి చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు శౌర్య. 
 
అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ముందే చెప్పిన, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో నాగశౌర్య 'ఆర్చర్' గా కనిపించనునట్లు అర్థమవుతుంది. ఇక నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా వస్తున్న దీనిని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.