శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (10:34 IST)

టాప్ లెస్.. జాకెట్ అందించేదాకా.. అజయ్ దేవ్‌గన్ నన్ను కవర్ చేశాడు..?

పెళ్ళికీ, సహజీవనానికీ పెద్దగా తేడా లేదని ఇటీవల కామెంట్ చేసిన ఇలియానా ప్రస్తుతం తన టాప్ లెస్ ఫోటోపై స్పందించింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అక్కడ ఛాన్సుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్

పెళ్ళికీ, సహజీవనానికీ పెద్దగా తేడా లేదని ఇటీవల కామెంట్ చేసిన ఇలియానా ప్రస్తుతం తన టాప్ లెస్ ఫోటోపై స్పందించింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అక్కడ ఛాన్సుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇలియానా నటిస్తున్న తాజా చిత్రం 'బాద్‌షాహో'లో మేరే రష్‌కే కమర్ అనే పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలో ఇల్లీబేబీ స్కిన్ షో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. 
 
మ్యూజిక్‌కి తోడు.. కెమిస్ట్రీతో అజయ్ దేవ్‌గన్, ఇలియానాలపై చిత్రీకరించిన ఈ రీమిక్స్ రొమాంటిక్ సాంగ్ అదిరింది. ఈ సాంగ్ చివరలో ఇల్లీ బేబీ తనంతట తానే జాకెట్‌ని జారవిడిచే ఓ సన్నివేశం ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ స్ట్రిప్‌టీజ్‌పై వివరణ ఇచ్చిన ఇలియానా.. పాట చివరలో అలా టాప్‌లెస్‌గా కనిపించాలనే ఐడియా తనదే అని చెప్పుకొచ్చింది. 
 
నటుల మధ్య వున్న పరస్పర నమ్మకానికి ఈ దృశ్యం ఓ ఉదాహరణ అని ఇలియానా తెలిపింది. అంతేకాకుండా ఆ పాట షూటింగ్ జరిగే సమయంలో తాను న్యూడ్‌గా ఉండకుండా మరొకరు జాకెట్ అందించేంత వరకు అజయ్ దేవ్‌గన్ తనకి రక్షణ కవచంలా కవర్ చేశాడని ఇలియానా అంటోంది.