గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 మే 2023 (16:50 IST)

బ్రెయిన్ బ్యాక్ డ్రాప్ తో ఐక్యూ చిత్రం విడుదలకు సిద్ధమైంది

Sai Charan,  Srinivas, suman, Pratani Ramakrishna Goud
Sai Charan, Srinivas, suman, Pratani Ramakrishna Goud
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి. యల్. బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీ పతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్).అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా నటుడు  సుమన్ మాట్లాడుతూ..  చాలా కొత్త పాయింట్  ను సెలెక్ట్ చేసుకొని  తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఘటికాచలంకు వయసు పెరిగిన ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. తనే  ఈ సినిమాకు  కథ, మాటలతో పాటు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరో కు ఇది మొదటి చిత్రమైనా చాలా బాగా నటించాడు. రెగ్యులర్ కథలకు భిన్నంగా కొత్త కథలను  సెలెక్ట్ చేసుకొని  తీసుకొని చేస్తున్న  ఇలాంటి నిర్మాతకు మనం అండగా నిలబడాలి. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
 
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారు ఇందులో అద్భుతమైన పోలీస్ పాత్రలో నటించారు. తను ఏ సినిమా చేసిన ఆ సినిమాలకు అన్ని ప్రమోషన్ లలో పాల్గొని  సినిమాకు సపోర్ట్ గా, నిర్మాతకు అండగా నిలబడతారు . కొత్త సబ్జెక్టు తో చేసిన ఈ సినిమా చూశాను చాలా బాగుంది. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర నిర్మాత కాయగూరల లక్ష్మీ పతి మాట్లాడుతూ..ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా. మేధావి అయిన అమ్మాయి మెదడును అమ్మడానికి వాళ్ళ ప్రొఫెసర్  ఎలా ప్లాన్ చేశాడు అనే కొత్త యూనిక్ పాయింట్ ఇప్పటి వరకు  రాలేదు. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.యూత్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మా అబ్బాయి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్ ,సూర్య, పల్లె రఘునాథ్ రెడ్డి,జబర్దస్త్ శేషు, గీతా సింగ్, వంటి మంచి నటీనటులు అలాగే మంచి టెక్నిషియన్స్ లభించారు.సినిమా బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  ఈ సినిమాను కంప్లీట్ చేశాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ జి.యల్. బి మాట్లాడుతూ, యూత్ కు సంబంభించిన మూవీ “IQ”. IQ అంటే మేధస్సుకు సంబందించిన చిత్రం. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ తో పాటు  ఇందులో నటించిన  వారంతా  చాలా బాగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రానికి  టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు.త్వరలో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమాకు  మీరందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాను అన్నారు.
 
సంగీత దర్శకుడు పోలూరి ఘటికాచలం మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది. విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనే కొత్త పాయింట్ ఇప్పటి వరకు  రాలేదు. యూత్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.