సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (13:40 IST)

బన్నీ అల వైకుంఠపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న సినిమా అలవైకుంఠపురములో. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గాను యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి జనవరి 6 న చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్‌ రానున్నారని సమాచారం.
 
అలవైకుంఠపురములో సినిమాలో బన్నీ సనసన పూజ హెగ్డే నటిస్తుంది. మరోవైపు టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తరువాత సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దుమ్ముదులుపుతున్నాయి. 
 
ఇకపోతే.. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ''సరిలేరు నీకెవ్వరు'' 11న ‘అల వైకుంఠపురములో 12న విడుదలకానున్నాయి. దీంతో ఇరు టీమ్స్ తదుపరి పనుల్లో బిజీ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆదివారం రాత్రి 9:09 గంటలకు నేరుగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నుండి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.