సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (12:10 IST)

మహేష్ బాబు హీరోయిన్‌‌కు పెళ్లి : వరుడు ఎవరంటే...

kiara advani
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన కియారా అద్వానీ పెళ్లి కుమార్తె కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రకు నేడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి రాజస్థాన్‌‌లోని జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్ ప్యాలెస్‌ వేదికైంది. పంజాబీ సంప్రదాయంలో వీరిపెళ్లి అంరంగ వైభంగంగా జరగనుంది. అయితే, వివాహ బంధానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో స్నేహితులు, బంధువులు ఇప్పటికే జైసల్మేర్ చేరుకున్నారు. 
 
తాజాగా కియారా చిన్ననాటి స్నేహితురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మద్దుల తనయ ఈషా అంబానీ ఆదివారం రాత్రి జైసల్మేర్ చేరుకున్నారు. ఈషా - కియారా చిన్ననాటి మిత్రులని సమాచారం. ఈ నేపథ్యంలోనే కియారా - సిద్ధార్థ్ వివాహానికి ఈషా తన భర్త ఆనంద్ పిరమిళ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది.
 
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ ఫంక్షన్‌లు జరగ్గా.. ఫిబ్రవరి 6 (సోమవారం) వీరి వివాహం జరుగనుంది. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.