మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జనవరి 2025 (09:55 IST)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

dil raju
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లో మంగళవారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసం, ఆఫీస్‌లతో పాటు మొత్తం 56 అధికారుల బృందాలు ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాకంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. 
 
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' అనే రెండు చిత్రాలు ఈ సంక్రాంతి పండుగకు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు మూడు రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ నెల 10న 'గేమ్ ఛేంజర్', 14న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు మూవీలు భారీ బడ్జెట్ మూవీలే కావడం గమనార్హం. 
 
అయితే, 'గేమ్ ఛేంజర్' మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. మరోవైపు, 'సంక్రాంతికి వస్తున్నాం' మాత్రం భారీ మొత్తంలో కలెక్షన్లు రాబడుతుంది. పైగా, ఈ చిత్రం సంక్రాంతి రేసులో తొలిస్థానంలో నిలిచింది. రెండు చిత్రాలు కూడా కలెక్షన్లను రికార్డు స్థాయిలో రాపట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో సోదాలకు దిగారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఈ సోదాలు జరిగాయి. మొత్తం 55 బృందాలు రంగంలోకి దిగి ఏక కాలంలో 8 చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత పత్రాలను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు.