సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (17:41 IST)

మెగా బ్రదర్ లేకపోయినా నష్టం లేదు.. ''జబర్దస్త్''కు తగ్గని క్రేజ్

జబర్దస్త్ కార్యక్రమం నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న తర్వాత ఆ షోకి ఏమాత్రం రేటింగ్ తగ్గలేదు. ఇక నాగబాబుతోనే మొదలైన 'అదిరింది' రేటింగ్ పరంగా జబర్దస్త్‌కి చాలా దూరంలోనే వుండిపోయింది. 'అదిరింది' ప్రసారమయ్యే సమయానికి ఇవతల చానల్ వారు 'జబర్దస్త్' పాత ఎపిసోడ్స్‌లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి.. హైలైట్స్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలు పోటీ వాతావరణంలో ప్రసారమవుతున్నాయి.
 
కాగా.. ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కార్యక్రమాలకు ఇన్నాళ్లు అన్నీ తానై నడిపించాడు నాగబాబు. కాని ఇటీవల మల్లెమాల ప్రొడక్షన్స్‌తో కలిగిన విభేదాల నేపథ్యంలో ఆయన ఈటీవీని వీడి జీటీవీలో 'అదిరింది' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అయితే ఆ షో జబర్దస్త్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. నాగబాబు వెళ్లిన తర్వాత కూడా జబర్దస్త్ రేటింగ్ తగ్గకుండా దూసుకెళ్తోంది.