'గులాబీ' కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ
'గులాబీ'... కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరో జేడీ చక్రవర్తి కెరీర్‌ని ఏ విధంగా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈటీవీ కార్యక్రమం 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ... 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు. దాని తర్వాత ఆ కథని తీసుకుని చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను.
కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
మరి అంత కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమా అంత బాగా వచ్చిందేమో...