బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (14:11 IST)

హిప్పీ అంటే ఏమిటి..? కార్తీకేయ షర్టు విప్పేశాడు.. జేడీ చక్రవర్తి ప్యాంట్ విప్పేశాడు (video)

హిప్పీ సినిమా ప్రమోషన్ ఓ స్థాయిలో లేదు. హిప్పీలో నటించిన ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయ, స్టార్ హీరో జేడీ చక్రవర్తిలు బట్టలిప్పేసిన స్థాయిలో వుంది. ప్రస్తుతం సినిమా అయినా, సీరియల్ అయినా దాన్ని ప్రమోషన్ ద్వారా పాపులర్ చేసే విధానం ట్రెండ్ అవుతోంది. ప్రోమోకు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత వుంది. అదికూడా ప్రోమోల కోసం పలు టెక్నిక్స్ ఫాలో చేస్తున్నారు. 
 
తాజాగా ''హిప్పీ'' సినిమా స్టార్స్ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో హిప్పీ అంటే ఏమిటి అని ఓ వ్యక్తి అడగ్గా.. కార్తీకేయ షర్టును విప్పేయడం.. జేడీ చక్రవర్తి ప్యాంటును విప్పేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. రొమాంటిక్ సన్నివేశాలు పండించడంతో కార్తీకేయకు అందివేసిన చేయి. ఇతడు టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తాజాగా హిప్పీ సినిమాలో నటిస్తున్నాడు. 
 
ఇందులో జేడీ చక్రవర్తి కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యేందుకు వెళ్లారు. ఇంటర్వ్యూ కార్యక్రమం అయ్యాక.. హిప్పీ అంటే ఏమిటి అంటూ యాంకర్ ప్రశ్నించాడు. 
 
అంతే హిప్పీ అంటే ఏమిటంటే? అంటూ బదులిచ్చేలా.. ఆర్ఎక్స్ హీరో కార్తీకేయ షర్టు విప్పేశాడు. ఇక జేడీ చక్రవర్తి మరో అడుగు ముందుకేసి ప్యాంటు విప్పేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధిత వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.