సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:15 IST)

#JwalaVished గుత్తా జ్వాలా-విష్ణు విశాల్ పెళ్లి ఫోటో వైరల్

Jwala_Gutta
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. గతరెండ్రోజుల నుంచి గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి సంబరాలు ప్రారంభం కాగా... వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజాగా పెళ్లి బట్టల్లో వధూవరులుగా మెరిసిపోతున్న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పిక్ వైరల్ అవుతోంది. ఈ పిక్ లో గుత్తా జ్వాలా స్కై బ్లూ కలర్ రెడ్ బోర్డర్ చీరతో పెళ్లి కూతురు అలంకరణతో మెరవగా... విష్ణు తెల్లటి షర్ట్, పంచ ధరించి పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. ఇక చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ మూడేళ్ల క్రితం తమ సంబంధాన్ని ప్రకటించారు. 
Jwala Gutta_Vishnu Vishal
 
హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ వీరి వివాహ వేడుకకు వేదికైంది. కోవిడ్‌ దృష్ట్యా కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Jwala Gutta_Vishnu Vishal