శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (15:47 IST)

సీరియల్ నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య.. వంటింట్లో ఉరేసుకుని..?

Sameer Sharma
భారతీయ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొందరు, ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ సంఘటన మరవక ముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
హిందీలో పలు సీరియల్స్‌లో నటించే మోడల్ కమ్ నటుడు సమీర్ శర్మ ముంబైలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 44 ఏళ్ల సమీర్ శర్మ.. యే రిస్తా హై ప్యార్ కే, కహానీ ఘర్ ఘర్‌కీ వంటి సీరియల్‌తో బాగా గుర్తింపు పొందాడు.
 
ఈయన తన వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. 
 
అయితే ఇతను రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబైలోని మలాడ్ పోలీసులు తెలిపారు. మరోవైపు అతని ఆత్మహత్య చేసుకునే ముందు ఏమైనా సూసైడ్ నోట్ రాసుకున్నాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.