సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:47 IST)

మహనీయులు తరహాలోనే జైలుకెళతా : కంగనా రనౌత్

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆదర్శప్రాయమైన మహనీయుల మాదిరిగానే తాను కూడా జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా ద్వారా కంగన, ఆమె సోదరి రంగోలీ వ్యాఖ్యలు చేస్తున్నారని ముంబై కోర్టులో ఇటీవల పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇక, మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వీరిద్దరూ వచ్చేవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది.  
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ స్పందిస్తూ, 'నేతాజీ, సావర్కర్, ఝాన్సీ రాణి వంటి వారిని నేను ఆరాధిస్తాను. ఈ రోజు ప్రభుత్వం నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలనుకుంటోంది. నేను జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. నాకు ఆదర్శనీయులైన వ్యక్తులు ఎదుర్కొన్న కష్టాలను నేనూ ఎదుర్కోవాలనుకుంటున్నాను. అప్పుడే నా జీవితానికి కొంత అర్థం ఏర్పడుతుంది. జైహింద్' అని పేర్కొంది. 
 
అలాగే రాణీ లక్ష్మీబాయి కోటను కూలగొట్టినట్టే ముంబైలో తన ఇంటిని పడగొట్టారని, ఇప్పుడు తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించిన సభ్యులను.. వారు ఇక్కడ ఎదుర్కొన్న కష్టాలేంటో ఎవరైనా అడిగితే బాగుణ్ను అంటూ ట్వీట్ చేసి దానిని హీరో ఆమిర్ ఖాన్‌కు ట్యాగ్ చేసింది.