శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (15:34 IST)

కాశీ గురించి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాశీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. కాశీలో ఎక్కడ చూసినా శివుడేనని ఆమె వ్యాఖ్యానించింది. శివుడు కాశీలోని ప్రతి అణువులోనూ ఉన్నాడని, దానికి నిర్మాణం అవసరం లేదని ఆమె పేర్కొంది. మధురలో ప్రతీ అణువులోనూ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు. 
 
అలాగే, అయోధ్యలోని ప్రతి భాగంలోనూ రాముడు ఉంటాడు. అదే మాదిరి కాశీలోని ప్రతి అణువులోనూ మహేశ్వరుడు ఉంటాడు. ఆయనకు నిర్మాణం అవసరం లేదు. ఆయన ప్రతి కణంలోనూ నివసిస్తుంటాడని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. కంగనా రనౌత్ తాజాగా 'ధాకడ్' అనే సినిమాలో నటించిన తెలిసిందే. సినిమా విడుదలకు ముందు.. ఈ చిత్ర బృందం బుధవారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.