శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (12:18 IST)

నా బయోపిక్‌ చిత్రాన్ని నేనే తీస్తానంటున్న కంగనా రనౌత్

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బయోపిక్‌ రూపొందుతోందని అందరికి తెలిసిందే. జ‌య‌ల‌లిత‌గా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవిందస్వామి న‌టిస్తున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. 
 
జయలలిత బయోపిక్‌‌‌ చిత్రం పూర్తైన తరువాత, కంగన రనౌత్ త్వరలో తన బయోపిక్‌‌‌ను కూడా చేస్తానని అంటోంది. 'నా జీవితంలో జరిగిన సంఘటనలతో సినిమా తీస్తాను. ఒకవేళ సినిమా తీయడం కుదరకపోతే కనుక ఆ విశేషాలతో కచ్చితంగా పుస్తకమైనా రాస్తాను'  అని చెప్పుకొచ్చింది కంగన.