శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (09:25 IST)

'బుజ్జిగాడు' హీరోయిన్‌కు బెంగుళూరులో పది ఫ్లాట్లు... ఎలా?

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు ఉన్నారు. వీరిద్దరి మూవీ సక్సెస్ రేటు అంతంత మాత్రమే. కానీ మంచి పాపులర్.. ఎలా? పైగా, సంజనాకు భారీ మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
డాషింట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బుజ్జిగాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలుక‌రించింది క‌న్న‌డ బ్యూటీ సంజ‌నా గ‌ల్రాని. ఆ త‌ర్వాత 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రంతో కీల‌క పాత్ర‌లో న‌టించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆశించిన స‌క్సెస్ అయితే రాలేదు. 
 
అయితే, డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో ఈ అమ్మడు గురించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ కెరీర్‌లో పెద్ద‌గా స‌క్సెస్‌లేని సంజ‌నా పేరు మీద బెంగ‌ళూరులో 10 ప్లాట్లున్న‌ట్టు పోలీసులు గుర్తించిన‌ట్టు స‌మాచారం.
 
సినిమాల ద్వారా అంత‌గా ఆదాయం లేని సంజ‌నాకు ఇన్నీ ఆస్తులు ఎలా వచ్చాయ‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. బ‌డా బాబుల అండ‌తో డ్ర‌గ్స్ అమ్మ‌కాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇన్ని ఆస్తులు కూడ‌బెట్టిందా..? అని అనుమానిస్తున్నారు పోలీసులు. మ‌రి సంజ‌నా వెనుక ఉన్న ఆ బ‌డాబాబులెవ‌ర‌నేది తెలియాల్సి ఉంది.