శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (21:58 IST)

కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి..

Mandya Ravi
Mandya Ravi
ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రవి ప్రసాద్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.
 
కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. అప్పట్లో టీవీలో వచ్చిన పలు సీరియల్స్‌లో రవి నటించారు. ప్రముఖ రచయిత హెచ్ ఎస్ ముద్దె గౌడ కుమారుడే రవి ప్రసాద్. 
 
మహామయి అనే టీవీ సీరియల్‌తో ఫేమస్ అయిన రవి.. చిత్రలేఖ, వరలక్ష్మీ, యశోద వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు. ఇక రవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.