మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (17:41 IST)

మార్చి 1న నెట్ ఫ్లిక్స్‌లో కాంతారా ఇంగ్లీష్ వెర్షన్

Kanthara
కన్నడ చిత్రం కాంతారావు భారతీయ సినిమా పరిశ్రమలో 2022లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి మెగాఫోన్ కూడా పట్టాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. 
 
తాజా వార్త ఏమిటంటే, డిసెంబర్ 2022లో అధికారికంగా ప్రకటించిన కాంతారా ఇంగ్లీష్ వెర్షన్ చివరకు దాని ఓటీటీ విడుదల తేదీని రిలీజ్ చేసింది. కాంతారా ఇంగ్లీష్ వెర్షన్ మార్చి 1, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా విడుదల కానుంది. 
 
కాంతారా సినిమాలో కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రానుంది.