గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (11:56 IST)

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన రిషబ్ శెట్టి "కాంతారా"

kantara poster
కన్నడ దర్శక హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం "కాంతారా" ఈ చిత్రం విడుదలైన కన్నడ, తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సంయుక్తా హెగ్డే హీరోయిన్. హోంబలే ఫిలిమ్స్ రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. కానీ, ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. 
 
ఒక్క కన్నడంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ యేడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డుల కోసం కాంతారా కూడా నామినేషన్ చేర్చాలని హోంబలే ఫిలిమ్స్ దరఖాస్తు పంపగా, ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ ఆ నిర్మాణ సంస్థ తెలిపింది. చిత్రం బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఆస్కార్ కంటెన్షన్ జాబితాకు ఎంపికైంది.