బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (11:24 IST)

కార్తికేయ దర్శకత్వంలో ముద్ర ఫస్ట్ లుక్ పోస్టర్

Mudra First Look
Mudra First Look
రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ముద్ర". ఈ సినిమాను కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్ పీ, ఆల్తాఫ్ మూవీస్ బ్యానర్స్ పై నయ్యర్ అల్తాఫ్ ఖాన్, కార్తికేయ. వి నిర్మిస్తున్నారు. కార్తికేయ.వి దర్శకత్వం వహిస్తున్నారు.
 
న్యూ ఇయర్ సందర్భంగా ముద్ర సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ముద్ర టీమ్ ద్వారా ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ తెలియజేశారు. ముద్ర సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సరికొత్త కథా కథనాలతో ముద్ర సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
 
నటీనటులు - రణధీర్, నరేష్ మేడి, నవనీత్, స్మృతి పాండే, గుణవంతి, కేటీ మల్లిఖార్జున్, రాఘవ మందలపు, సాయి మందలపు,  ప్రతాప్ చల్లా తదితరులు