గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (20:28 IST)

చీకటి గదిలో చితక్కొట్టుడు... అక్కడ కత్తి మహేష్‌కి ఏం పని?

అడల్ట్ హారర్ కామెడీ అంటే బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇలాంటి చిత్రాలను ఆమె అడపాదడపా తీసి చూపిస్తుంటారు. ఐతే ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కాస్త వెనకబడి వుంటుంది. ఎందుకంటే.. ఆ కామెడీ కాస్త జుగుప్సగా వుంటుందనే టాక్ వుండనే వుంది. ఐతే అలాంటిదేమీ లేకుండా అడల్ట్ జనం బాగా నవ్వుకునేట్లు 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే చిత్రాన్ని తీస్తున్నామని అంటున్నారు దర్శకనిర్మాతలు. 
 
ఐతే ట్రెయిలర్ చూస్తే మాత్రం ఇదేదో బూతుకు మించిన బూతు చిత్రమేమో అనే భావన కలుగక మానదు. ఐతే అదంతా జస్ట్ ట్విస్టులేనని అంటున్నారు. ఈ చిత్రం ట్రెయిలర్ విడుదల చేస్తే దాన్ని ప్రమోట్ చేస్తూ కత్తి మహేష్ కనిపించారు. మరి... అడల్ట్ కామెడీ చిత్రానికి కత్తి ఏదయినా మాట్లాడితే ప్లస్ అవుతుందని అనుకున్నారేమోగానీ... ఆయన ఆ విషయాలను బాగానే చెప్పినట్లు కనబడుతున్నారు. ఇక్కడ వీడియో లింక్ చేద్దామంటే అడల్ట్స్ కూడా అదిరిపోతారేమోనని అతికించడంలేదు.