మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (11:24 IST)

రాముడు ఓ దగుల్బాజీ... కత్తి మహేష్ అరెస్టు

కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడిని ఓ దగుల్బాజీ అంటూ వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్ మాట్లాడు

కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడిని ఓ దగుల్బాజీ అంటూ వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్ మాట్లాడుతూ సీతారాములను కించపరిచేలా వ్యాఖ్యానించారు.
 
దీనిపై అనేక హిందూ సంఘాలు కత్తి మహేష్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మంగళవారం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.