శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

మెస్మరైజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గ్రాండ్‌గా వెండితెర ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె ‘కేదార్‌నాథ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గ్రాండ్‌గా వెండితెర ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె ‘కేదార్‌నాథ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల తాజాగా రిలీజ్ చేసింది.
 
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సారా అలీఖాన్ బ్యూటీఫుల్ కాస్ట్యూమ్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. తెలుపు రంగు కాస్టూమ్స్ వేసుకున్న సారా గొడుగు పట్టుకుని.. గుర్రంపై కేదార్‌నాథ్‌కు వెళ్తున్న స్టిల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.
 
'ఎంఎస్ ధోనీ' ఫేం సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కేదార్‌నాథ్‍‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని.. ఇటీవలే ముంబైకు చేరుకుంది.