ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (22:01 IST)

కె.జి.ఎప్‌.2 స‌రికొత్త ప్రోగ్రెస్‌ (video)

Malavika Avinash
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న `కేజీయఫ్ చాప్టర్ 2` ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాల‌ను నెల‌కొంది. కెజిఎఫ్ స‌క్సెస్ త‌ర్వాత ఈ సీక్వెల్‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం తాజా షెడ్యూల్ కూడా కొంత చేయాల్సివుంది. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల తేదీపై ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. లెక్క ప్ర‌కారం జులై  16న విడుద‌ల‌కావాల్సి వుంది. కానీ క‌రోనా వ‌ల్ల పూర్తిగా షెడ్యూల్ మార్చేసింది.
 
ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌లే ఇందులో కీల‌క పాత్ర పోషించిన మాళ‌విక అవినాష్ డ‌బ్బింగ్‌లో పాల్గొంది. ఈ సినిమా అద్భుతంగా వుంద‌నీ, ఇప్ప‌టివ‌ర‌కు క‌న్న‌డ చ‌రిత్ర‌లోనే రాలేని సినిమాగా పేర్కొంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా క‌న్న‌డ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయిలా నిలుస్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది. ఇంకా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తికాలేదు క‌నుక ఈ సినిమా సెప్టెంబర్ రిలీజ్ కానుంది అని సరికొత్త టాక్ మొదలయ్యింది. ఇలా ఈ భారీ చిత్రంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి మేకర్స్ ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఎప్పటికి ప్లాన్ చేస్తున్నారో చూడాలి.