మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (16:16 IST)

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

Ka sucess cake- ka team
Ka sucess cake- ka team
హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. "క" సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. "క" సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
 
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ - మాకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేవు. మంచి కథతోనే దర్శకులుగా కెరీర్ ప్రారంభించాలని అనుకున్నాం. మాకు సరైన దారి దొరకని టైమ్ లో కిరణ్ గారు అవకాశం ఇచ్చారు. మా కథను నమ్మి సినిమా చేశారు. "క" స్క్రిప్ట్ ఏదో ఒక సెక్షన్ ఆడియెన్స్ కే రీచ్ అవుతుందని కొందరు భయపెట్టారు. కానీ మంచి సినిమాను ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. మా తర్వాత వచ్చే వాళ్లకు కూడా ఎంకరేజింగ్ రిజల్ట్ ఇచ్చారు. అన్నారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - "క" సినిమా కంటెంట్ మొదటి నుంచీ చూస్తున్నాను. దాదాపు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర  భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో కూడా ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మరోసారి వస్తుందా లేదా అనేది చెప్పలేం. ఆ పోటీలో "క" సినిమా తట్టుకుని నిలబడి ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. మీరంతా మీ సినిమాను నమ్ముకుని హార్డ్ వర్క్  చేశారు. మీ టీమ్ అందరినీ ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడుతాను. "క" సక్సెస్ మీట్ వేదిక మీద ఉండటం మాకూ సంతోషాన్ని ఇస్తోంది. ఈ మూవీ టీమ్ కు నా అభినందనలు. మీరు తర్వాత ఎన్ని విజయాలు సాధించినా, కెరీర్ ఎర్లీ డేస్ లో సాధించిన సక్సెస్ లే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కిరణ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కష్టంతో, ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. ఇలాగే అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు, గెస్ట్ లుగా రారు. మన సినిమానే, మన టాలెంటే మనల్ని కాపాడుతుంది. అన్నారు.
 
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ - "క" సినిమాకు మీడియా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా అంతటి ఆదరణ దక్కింది. ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాళ్లు కూడా మా మూవీకి వెళ్లి బాగుందని చెబుతున్నారు. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంచి సినిమా చేశామనే సంతృప్తిని "క" మిగిల్చింది. కిరణ్ అబ్బవరంతో పాటు మిగతా టీమ్ అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - మా "క" సక్సెస్ మీట్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్. మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను. క రిలీజ్ కు ముందు నెగిటివ్ గా మాట్లాడిన వారు 99 పర్సెంట్ ఉండేవారు. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. క టీమ్ అందరికీ మూవీ సక్సెస్ క్రెడిట్ ఇస్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, అందుకే ఫెయిల్యూర్, సక్సెస్ కు ఒకేలా రియాక్ట్ అవుతున్నాను. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలా ఆ నెంబర్స్ మారిపోవడానికి. మా మూవీని ఆదరిస్తున్న వాళ్లను పర్సనల్ గా వచ్చి కలుస్తాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను. అన్నారు.
 
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - కిరణ్ రాజావారు రాణిగారు సినిమా తర్వాత మళ్లీ క మూవీ ఫంక్షన్ కు వచ్చాను. తన కెరీర్ ను మొదటినుంచీ చూస్తున్నా. మంచి సక్సెస్ లు అందుకున్నాడు. మధ్యలో రెండు మూడు సినిమాలు పోయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఒకరి ఫెయిల్యూర్ ను ఇంతగా సంతోషపడతారా అనిపించింది. ఇలాంటి నెగిటివిటీని తట్టుకుని ఈరోజు క వంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. ఆ సినిమాను పండక్కి రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాడు. కిరణ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఎంతోమందికి నువ్వు ఇన్సిపిరేషన్. ఈరోజు ప్రేక్షకులు మంచి సినిమా చేసిన వారిని తప్పకుండా ఆదిరస్తున్నారు. దర్శకులు సుజీత్, సందీప్ గురించి ప్రశంసలు వస్తున్నాయి. మీరిద్దరు రాజ్ డీకే అంత పేరు తెచ్చుకోవాలి. క టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.