బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (13:32 IST)

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram
Kiran Abbavaram
"క" సినిమా గురించి ఆ సినీ హీరో కిరణ్ అబ్బవరం సక్సెస్ విషయాలు వెల్లడించారు. "మంచి సినిమా చేస్తే ఇంతలా ఆదరిస్తున్నారు. నేను లాస్ట్ 30 నిముషాలు నమ్మి సినిమా చేశాను. అదే నిజం అయింది. సక్సెస్ ఊహించను. కానీ అంతకు మించి నాకు ఇచ్చారు. 
 
సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్. చాలామంది టికెట్స్ కావాలని అడుగుతున్నారు. ఫ్యామిలీతో చూసే సినిమా. పెద్దలు బాగా కనెక్ట్ అవుతారు. మీ ఇంట్లో అబ్బాయిగా ట్రీట్ చేశారు. ముందు ఫెయిల్యూర్ హీరో అన్నారు. కానీ నాకు నాపై నమ్మకం ఉంది. నాలా ఫెయిల్యూర్‌తో బాధపడే నటులకు ఒకటే చెపుతున్నా. కష్టపడితే మనకు ఓ రోజు వస్తుంది" అన్నారు. 
 
"Ka" అంటే క్లైమాక్స్‌లో తెలిపారు. అది సినిమాలో చూస్తేనే అర్ధం అవుతుంది. క అనేది సంస్కృత పదం.. Ka 2 కూడా వుంది. త్వరలో చేస్తామని... పెళ్లి అయ్యాక మంచి జరుగుతుంది అన్నారు. అది నిజం.. నాలా పెళ్ళికాని వారు పెళ్లి చేసుకోండని చలోక్తి విసిరారు. తమిళనాడులో కూడా క హౌస్ ఫుల్ అంటూ కిరణ్ అబ్బవరం వెల్లడించారు.