'ఆచార్య' లేటెస్ట్ అప్‌డేట్స్ .. 'సిద్ధ'మవుతున్నాడంటూ కొరటాల ట్వీట్

acharya still
ఠాగూర్| Last Updated: సోమవారం, 1 మార్చి 2021 (16:35 IST)
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.

చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా లొకేషన్‌లో రామ్‌చరణ్‌ ఫొటోను షేర్‌ చేసిన కొరటాల శివ.. 'ఆచార్య సిద్ధమవుతున్నాడు' అంటూ మెసేజ్‌ను పోస్ట్‌ చేశాడు.

'ఆచార్య'లో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సిద్ధ అనే ఓ పవర్‌పుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ షేర్‌ చేసిన ఫొటోలో చరణ్‌ వెనుక నుంచి కనిపిస్తున్నాడు. రగ్డ్‌ లుక్‌లో చరణ్‌ కనిపిస్తుండగా, చిరంజీవి చరణ్‌ భుజంపై చేయి వేసుకుని ఉన్నాడు. ఈ ఫొటోపై స్పందించిన రామ్‌చరణ్‌ 'కామ్రేడ్‌ మూమెంట్‌.. 'ఆచార్య' సెట్‌లో ప్రతి క్షణాన్ని చిరంజీవితో, కొరటాలతో ఎంజాయ్‌ చేస్తున్నాను' అన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది మే 13న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.

దీనిపై మరింత చదవండి :