గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (11:14 IST)

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' వెన్నుపోటు.. ఈ ఫోటోలో వున్నదెవరు?

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాతో రామ్ గోపాల్ వర్మ సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వర్ధంతి రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవంతో వస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనే అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు చెప్తూ వస్తున్నారు. 
 
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న వర్మ.. ఇటీవల వెన్నుపోటు సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట నెట్టింట వైరల్ అయ్యింది. టీడీపీ నేతలు ఈ పాటపై విమర్శలు గుప్పించారు. తాజాగా, బాహుబ‌లి సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచిన పోస్టర్‌ను కాస్త మార్పు చేసిన వర్మ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ చిత్రంలో వ్యక్తులు ఎవరో గుర్తించేందుకు తనకు సాయం చేయాలని కోరారు. ఇందులో బాహుబలి ముఖం ఎన్టీఆర్ మాదిరిగా, కట్టప్ప ముఖం చంద్రబాబు మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.