గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (10:43 IST)

శరీరాన్ని అమ్ముకుంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది.. వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మీటూ ఉద్యమంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. మీటూ ద్వారా అమ్మాయిలకు కొంతవరకూ ఉపయోగం ఉంటుందని చెప్పిన వర్మ, కష్టం ఎదురైతే ఎలా స్పందించాలన్న విషయమై వాళ్లకు కొంత అవగాహన ఏర్పడిందన్నాడు. పరిస్థితి మారుతుందని మాత్రం తాను అనుకోబోవడం లేదని, మగాడి నైజం మారబోదని తెలిపాడు. 
 
తన దృష్టిలో ఓ యాక్షన్ సినిమా, పోర్న్ సినిమా చూసినా ఒకటేనని, పొగ తాగితే, మద్యం తాగితే వ్యక్తి చనిపోతాడే తప్ప పోర్న్ సైట్ చూస్తే చావడని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కల్యాణి చిత్రంలోని ఓ డైలాగును వర్మ గుర్తు చేశాడు. 
 
ఆ సినిమాలో ఓ గాయని తను పాడిన పాటకు డబ్బులు తీసుకుంటుంది. గొంతును అమ్ముకుని సొమ్ము చేసుకున్నప్పుడు శరీరాన్ని అమ్ముకుంటే అది వ్యభిచారం ఎలా అవుతుందనే డైలాగ్ కూడా వుందన్నాడు. ఓ రకంగా ఆలోచిస్తే, ప్రపంచంలో ఏదీ నేరం కాదని, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే అభివృద్ధిలో ముందంజలో వున్నాయన్నాడు.