శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (12:45 IST)

లతా మంగేష్కర్‌కు కోవిడ్ : ఐసీయూలో చికిత్స

Latha mageshkar
లెజండరీ గాయని లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం చికిత్స కోసం ఆమెను ఐసీయూలో చేర్చారు. కోవిడ్ పట్ల గాయనికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆమె మేనకోడలు రచ్నా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని తెలిపారు. కాగా గత కొన్ని వారాల్లో కోవిడ్-19 కేసుల్లో భారతదేశం వేగంగా వ్యాప్తి చెందింది
 
ఒమిక్రాన్ వేరియంట్‌తో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా  సింగర్ లతా మంగేష్కర్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె వయస్సు 92 ఏళ్లు. 
 
ఇంతలో, దేశంలో మహమ్మారి యొక్క మూడవ తరంగాన్ని సూచించే పోకడలతో కోవిడ్-19 కేసుల్లో భారతదేశం భారీ పెరుగుదలను చూస్తోంది. సోమవారం భారత్ మొత్తం 1,68,000 పాజిటివ్ కేసులను నమోదు చేసింది. కేసుల్లో భయంకరమైన పెరుగుదలతో, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలను ప్రకటించాయి. పాక్షిక లాక్ డౌన్‌ను అమలు చేశాయి.