గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (22:10 IST)

వైట్ సాస్ పాస్తాతో ఆమె ఇంటికి వెళ్లి.. బెడ్ షేర్ చేసుకున్నా!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా లాకప్ అనే షోను నిర్వహిస్తోంగి. ఈ షో ద్వారా ఆమెకు క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఇక ఈ గేమ్‌లో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే ఒక సీక్రెట్‌ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా లాకప్‌ కంటెస్టెంట్‌, క్రికెటర్‌ శివమ్‌ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నట్లు తెలిపాడు.
 
'మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్‌ సాస్‌ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పడక షేర్‌ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది' అని శివమ్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన సీక్రెట్‌ విని షాకవడం మిగతా కంటెస్టెంట్లు షాకయ్యారు.