మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:10 IST)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం విశిష్టత ఏమిటి?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నేడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబర్ 17న) ప్రకటించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో నిర్వహిస్తోంది. ప్రపంచంలోని అన్ని భాషలను రక్షించుకోవాలనే వుద్దేశంతోనే ఈ రోజును నిర్వహిస్తున్నారు. 

 
బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి అనేది యునెస్కో మాట.