గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (22:41 IST)

"మా" ఎన్నికల్లో జీవితా రాజశేఖర్ ఓటమి.. రవిబాబు విన్

"మా" ఎన్నికల్లో తొలి నుంచి క్రియా శీలకంగా ఉన్న జీవిత రాజశేఖర్ ఓడిపోయారు. తాజా మాజీ కార్యవర్గంలో నరేశ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీవిత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

అయితే, తొలుత అధ్యక్ష బరిలో నిలిచినా..తరువాత ప్రకాశ్ రాజ్ కు మద్దతు ప్రకటించారు. దీంతో..ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసారు. 
 
హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో జీవిత పైన విష్ణు ప్యానల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో రఘుబాబును అటు నరేశ్.. విష్ణు కౌంటింగ్ హాల్ లోనే ఆలింగనం చేసుకొని అభినందించారు.
 
మరోవైపు తెలుగు సినిమా పరిశ్రమ నటీనటుల సంఘం.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ మీద విష్ణు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
 
ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఆధిక్యాలు అటూ తారుమారు అవుతూ వచ్చాయి. అధ్యక్ష పదవికి మంచు విష్ణు ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, విష్ణు అనుకూల వర్గాలు, జగన్ అనుకూల వర్గాలు సంబరాలు చేసుకున్నాయి.