శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (11:33 IST)

నాగబాబుకు నా సపోర్టు.. పవన్‌లో ఆ లక్షణాలు ఉన్నాయి : నరేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ కళ్యాణ్‌లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. 
 
ఆయన తాజా మాట్లాడుతూ, రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి దిక్సూచిగా ఉంటుందనే నమ్మకం తనకుందన్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గెలుపోటములతో తనకు సంబంధం లేదన్నారు. వ్యక్తిగా పవన్‌ చేస్తున్న సేవను అభిమానిస్తున్నట్టు చెప్పారు. 
 
యువతను మేల్కోలిపే లక్షణాలు పవన్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు తీసుకురావాలని పవన్‌ కల్యాణ్‌ ఒక యోగిలా తిరుగుతున్నారని అన్నారు. 'మా' ఎన్నికల్లో నాగబాబు తనకు మద్దతు పలికారని.. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న ఆయనకు తను సపోర్ట్‌ ఉంటుందని నరేష్‌ చెప్పారు. 
 
ఇకపోతే, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ గెలుపు బట్టి, వచ్చే ప్రభుత్వం బట్టి ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుందన్నారు. తెరాస కరెక్ట్‌గా చేస్తుందనే కదా మళ్లీ గెలిపించారు. తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం పోరాడుతోంది. దాన్ని ఎవరైనా సమర్థిస్తారన్నారు.