గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (16:06 IST)

అనుకోకుండా లేడీ సింగర్‌ను అక్కడ తాకిన మెగాస్టార్ చిరంజీవి, ట్రోల్స్

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి. ఆయన డ్యాన్స్ అంటే పూనకాలు వచ్చేస్తాయి. స్టెప్పులు వేయడం బిగిన్ చేసారంటే డ్యాన్స్ అంటే పెద్దగా ఇష్టం లేనివారు కూడా ఆయన వేసే డ్యాన్సుకి ఫిదా అవుతారు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్న దీపావళి పండుగనాడు చిరు ఇంట్లో సంబరాలు మిన్నంటాయి.
 
ఆ సందర్భంగా లేడీ సింగర్ రాజకుమారి జవాన్ సినిమా పాట పాడుతూ వుండగా దానికి చిరంజీవి స్టెప్పులు వేసారు. పక్కనే రాంచరణ్ కూడా తండ్రిని ఎంకరేజ్ చేస్తూ వున్నాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ అనుకోకుండా లేడీసింగర్ ను తాకరానికి చోట తాకారు చిరు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఐతే అదేమీ కావాలని చేసింది కాదనీ, అనుకోకుండా అలా టచ్ అయ్యింది వీడియో చూసినవారికి అర్థమవుతుంది.