శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (14:27 IST)

పేప‌ర్‌బాయ్‌కి మ‌హేష్ స‌పోర్ట్ కార‌ణం ఏంటో తెలుసా..?

ద‌ర్శ‌క‌నిర్మాత సంప‌త్ నంది నిర్మాణంలో రూపొందిన చిత్రం పేప‌ర్ బాయ్. ఈ చిత్రంలో సంతోష్ శోభ‌న్, రియా తాన్య జంట‌గా న‌టించారు. నూత‌న ద‌ర్శ‌కుడు జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన

ద‌ర్శ‌క‌నిర్మాత సంప‌త్ నంది నిర్మాణంలో రూపొందిన చిత్రం పేప‌ర్ బాయ్. ఈ చిత్రంలో సంతోష్ శోభ‌న్, రియా తాన్య జంట‌గా న‌టించారు. నూత‌న ద‌ర్శ‌కుడు జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.


ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కి విశేష స్పంద‌న‌ ల‌భించింది. ఈ మూవీని సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ చేయాల‌నుకున్నారు అయితే.. ఈ నెల 31న రావాల్సిన నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు వాయిదా ప‌డ‌డంతో ఈ నెల 31న పేప‌ర్ బాయ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. 
 
ఈ మూవీ ట్రైల‌ర్ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ... ''ఫ్రెష్‌గా..ప్లెజెంట్‌గా ఉంది. ఈ చిత్రంలో హీరోగా న‌టించిన‌ సంతోష్ శోభన్‌తో పాటు అతని టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను'' అని తెలియ‌చేశారు. 
 
మ‌హేష్ పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ గురించి స్పందించ‌డానికి కార‌ణం ఏంటంటే.... ? ఈ సినిమా హీరో సంతోష్ శోభ‌న్ డైరెక్ట‌ర్ శోభ‌న్ కొడుకు. ఆయ‌న మ‌హేష్ బాబుతో బాబీ సినిమాని తెర‌కెక్కించారు. ఆత‌ర్వాత  స‌డ‌న్‌గా గుండెపోటుతో చ‌నిపోయారు. అందుచేత త‌న‌తో వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్ కుమారుడు కాబ‌ట్టి మ‌హేష్ బాబు పేప‌ర్ బాయ్‌కి త‌న స‌పోర్ట్ తెలియ‌జేశాడు.