గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:49 IST)

వంద రోజులు పూర్తి చేసుకున్న "సర్కారువారి పాట"

sarkaaruvaari paata
ప్రిన్స్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". మే 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సంగీతం హైలెట్. చిత్రానికి ప్రాణం సంగీతమే. పైగా, ఈ చిత్రానికి మహేష్ బాబు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. 
 
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకు 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సినిమా వంద రోజుల పోస్టరును విడుదల చేసింది. 
 
మహేష్ బాబు, కీర్తి సురేష్ లవ్ ట్రాక్‌తో పాటు సముద్రఖని విలనిజం హైలెట్. తమన్ సంగీతం సమకూర్చగా, మాస్ ఆడియన్స్‌లోకి ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. మొత్తంమీద ఈ సినిమాతో పరశురాం మరో హిట్‌ను తన ఖాతాలో వసున్నారు.