శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:47 IST)

సహృదయం పేరు మ‌హేష్‌బాబు - చిరంజీవి

Mahesh Babu, Megastar Chiranjeevi
Mahesh Babu, Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్‌లో మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఓ ట్వీట్ చేశాడు. అది ఆయ‌న అభిమానుల్లో ఆనందాన్ని ప‌లికించింది. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... అని పేర్కొన్నారు.
 
దీనికి మ‌హేష్‌బాబు స‌హృద‌యంతో చెప్పిన ఈ మాట‌లు ఎంతో ఉత్సాహాన్నింపాయంటూ పేర్కొన్నారు. ఇరువురు ప‌లు ఫంక్ష‌న్ల‌లో క‌లుసుకున్న సంద‌ర్భాల‌ను గుర్తు చేసుకున్నారు. తాజాగా మ‌హేష్‌బాబు అభిమానులు ఈరోజు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఆర్‌.టి.సి. క్రాస్ రోడ్డులోగ‌ల సుద‌ర్శ‌న్ 70ఎం.ఎం. థియేట‌ర్‌లో రోజంతా పోకిరి షోను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ట‌పాసుల‌తో, కేసును క‌ట్‌చేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తారు. మ‌హేష్‌బాబుకు ఈ థియేట‌ర్ సెంటిమెంట్ థియేట‌ర్‌గా మ‌హేస్ అభిమాన సంఘం అధ్య‌క్షుడు రాజు తెలియ‌జేస్తున్నారు.