శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (16:00 IST)

మోదీ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌బాబు..

భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, అలాగే తొలిసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నటువంటి వైఎస్ జగన్‌కు సినీ నటుడు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.