సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (23:03 IST)

చిత్రం విడుదలకు థియేటర్లు లేవు, నిరాశలో కూరుకుపోయిన ‘కోటా- ద రిజర్వేషన్‌ ’ నటీనటులు, రూపకర్తలు

Aniruth
కుల ఆధారిత వివక్షకు సంబంధించిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తీర్చిదిద్దబడిన చిత్రం ‘కోటా- ద రిజర్వేషన్‌’. ఈ చిత్రం విడుదలకు ఇప్పుడు థియేటర్లు లభ్యం కాలేదు. విపరీతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ థియేటర్లు లభ్యం కాకపోవడంతో  ఈ చిత్ర రూపకర్తలు పూర్తి నిరాశలో కూరుకుపోయారు.

 
ఈ చిత్రంను థియేటర్లలో విడుదల చేయడానికి పూర్వమే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ఏడు భాషలలో రూపుదిద్దుకుంది. అయినప్పటికీ ఈ చిత్రంను ప్రదర్శించడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడానికి దీని కథాంశం కూడా ఓ కారణమే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందించబడిన ఈ చిత్రంలో  ప్రీమియర్‌ విద్యాసంస్థలలో దళిత విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షను వెల్లడించారు.

 
ఈ చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత సంజీవ్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ, ‘‘ భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేయాలన్నది మా కల. అయితే ఈ చిత్ర ప్రదర్శనకు మాకు థియేటర్లు లభించడం లేదిప్పుడు. ఎవరికీ తెలియని, మరుగనపడిన వాస్తవాలను చూపడం ద్వారా స్ఫూర్తి కలిగించాలన్నది మా ప్రయత్నం. ఈ కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నాము. మాకు థియేటర్లు లభించలేదు సరికదా కనీసం కపిల్‌ శర్మ షోలో పాల్గొనే అవకాశం కూడా లభించలేదు. ఈ దిశగా మేము ప్రేక్షకుల మద్దతు కోరుతున్నాము. థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శనకు మద్దతునందించడం కోసం 7247248449కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం’’ అని అన్నారు

 
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అనిరుధ్‌ దవే మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర నిర్మాణంలో మేమంతా తీవ్రంగా కష్టపడ్డాము. ఈ చిత్ర ప్రదర్శనకు  థియేటర్లు లభించకపోవడం మాకు పెద్ద కుదుపు. అయితే మేమంతా దీనిని అధిగమించాలనుకుంటున్నాము. ఎందుకంటే వివక్షను ఎదుర్కొంటున్న ప్రజలకు దీనిని మేము అంకితమివ్వాలనుకుంటున్నాము‌ అని అన్నారు. ఈ చిత్రంలో  గరీమా కపూర్‌, ఆదిత్య ఓం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.