మిరాయ్ సినిమాలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటున్న మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎలాంటి కమ్ బ్యాక్ మూవీ కోసం ఇన్నాళ్లూ వేచి చూశాడో అది "మిరాయ్" రూపంలో దక్కింది. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ గా మంచు మనోజ్ పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ స్టంట్స్ "మిరాయ్" సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇన్నాళ్లూ మనోజ్ లాంటి యాక్టర్ ను స్క్రీన్ మీద మిస్ అయ్యామంటూ ప్రేక్షకులు సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తున్నారు. అద్భుతమైన పర్ ఫార్మర్ దొరికితే విలన్ క్యారెక్టర్స్ హీరోను కూడా డామినేట్ చేస్తాయనేందుకు మనోజ్ చేసిన బ్లాక్ స్వార్డ్ ఎగ్జాంపుల్ అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
మనోజ్ ప్రతి సీన్ లో కనబర్చిన ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్, ఎమోషన్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ మనోజ్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ తో ట్రావెల్ చేశామని, ఆయన చేసిన ప్రతి సీన్ ను రియల్ గా ఫీల్ అయ్యామని, వన్ మ్యాన్ షో లా మంచు మనోజ్ పర్ ఫార్మెన్స్ ఉందని నెట్టింట అప్రిషియేషన్స్ వస్తున్నాయి. తన కెరీర్ కు ఒక టర్న్ లా మారుతుందని మనోజ్ భావించిన "మిరాయ్" ఆయన ఆశించిన సక్సెస్ ను, ఫేమ్ ను తీసుకొస్తోంది.