బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (12:15 IST)

రవితేజ 'రామారావు ఆన్‌ ‍డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!

హీరో రవితేజ నటిస్తున్న మరో కొత్త చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ఖరారు చేశారు. వచ్చే యేడాది మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. 
 
ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు శరత్ మండవ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో రవితేజ ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అందుకే ఈ చిత్రానికి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే పేరును ఖరారు చేశారు. విజయ్ కుమార్ చాగంటి, సుధాకర్ చెరుకూరిలు కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.