నిర్మాతలు వెయిట్ చేస్తారనుకుంటా : మీరా చోప్రా
కరోనా వైరస్ కారణంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన మూవీ షూటింగులు ఆగిపోయాయి. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. షూటింగులు మాత్రం జరుపుకునే పరిస్థితి మాత్రం లేదు. అలాగే, సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి.
దీంతో ఇపుడు డిజిటల్ ప్లాట్ ఫాం ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. అయితే సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో చూస్తే ఎలాంటి ఎక్సయిట్మెంట్ ఉండదంటోంది అందాల నటి మీరా చోప్రా.
కొత్త సినిమాలు ఓటీటీలో విడుదలువుతున్నాయి. వాటిని చూడాలనన్న ఉత్సుకత ఉండదు. సినిమాలనేవి తీసేది మొదట సిల్వర్ స్ర్కీన్ పై చూపించేందుకే. సినీ నిర్మాతలు థియేటర్లు రీఓపెన్ అయ్యే వరకు ఆగుతారని విశ్వసిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
థియేటర్ల ప్రాధాన్యత విషయంలో భవిష్యత్‌లో ఎలాంటి మార్పులుండవని ఆశిస్తున్నానని మీరా చోప్రా ట్వీట్ చేసింది. మీరా చోప్రా నటించిన సెక్షన్ 375 గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరోనాతో చిన్న, పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలవుతుండటంతో మీరా చోప్రా ఇలా ట్వీట్ చేసింది.