ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మే 2024 (12:41 IST)

స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : చిరంజీవి

ntramarao
స్వర్గీయ ఎన్.టి.రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కరాన్ని ప్రదానం చేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్.టి.ఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ కీర్తి అజరామరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం సముచితమని వ్యాఖ్యానించారు. 
 
"కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుగారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్‌లో తిరుగులేని మనిషి పేరుతో ఏకైక చిత్రం వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వీరమధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్‌లోనూ స్టార్లుగా ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకచోట కలిసినపుడు మాత్రం ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. ఇక ఆ స్నేహాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఇపుడు కొవసాగిస్తున్నారు.