శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (16:07 IST)

'గాడ్సే' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవి.. మైండ్ గేమ్ తరహాలో కథ

సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం "గాడ్సే". ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపి దర్శకత్వం వహించారు. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇందులో 'గాడ్సే' పాత్రలో ఉండే హీరో కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా చూపించారు. 'గాడ్సే' ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? 'గాడ్సే' అసలు పేరు ఏమిటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి? అంటూ ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారి హోదాలో ప్రశ్నిస్తుంది. 
 
"సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయిరా? ఎందుకంటే మీరంతా సేవల పేరుతో ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు?" అంటూ సత్యదేవ్ చెబుతున్న డైలాగ్  చాలా బాగా వుంది. కాగా, ఈ చిత్రంలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మిలు హీరో, హీరోయిన్లుగా నటించారు.